కోనసీమ అల్లర్లు: వైఎస్ జగన్ పట్టు కోల్పోతున్నారా?
జిల్లా పేరు మార్పుపై కోనసీమ అట్టుడికింది. బిఆర్ అంబేడ్కర్ జిల్లాగా దానికి నామకరణం చేయడంపై ఆ ప్రాంతానికి చెందిన ఓ వర్గం తీవ్ర ఆవేశకావేశాలకు లోనైంది.
జిల్లా పేరు మార్పుపై కోనసీమ అట్టుడికింది. బిఆర్ అంబేడ్కర్ జిల్లాగా దానికి నామకరణం చేయడంపై ఆ ప్రాంతానికి చెందిన ఓ వర్గం తీవ్ర ఆవేశకావేశాలకు లోనైంది. కోనసీమ సాధన సమితి చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. పోలీసులపై ఆందోళనకారులు దాడులకు దిగారు. మంత్రి విశ్వరూప్ ఇంటిని దగ్ధం చేశారు. ఎమ్మెల్యే సతీష్ ఇంటికి నిప్పు పెట్టారు. ఆ తర్వాత ఘటనపై రాజకీయం ప్రారంభమైంది. అధికార వైసిపి టిడిపి, జనసేనలే పథకం ప్రకారం విధ్వంసానికి కారణమయ్యాయని విమర్శిస్తే, వైసిపియే అల్లర్లకు పథక రచన చేసిందని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టు కోల్పోతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.