Asianet News TeluguAsianet News Telugu
breaking news image

ఫెడరల్ ఐడియా: ఎన్టీఆర్ లాగే చర్చకు పెట్టిన కేసీఆర్

భారతదేశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫెడరల్ వ్యవస్థగా భావిస్తున్నారు. 

భారతదేశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫెడరల్ వ్యవస్థగా భావిస్తున్నారు. విభిన్న ప్రాంతాల, విభిన్న సంస్కృతులు, విభిన్న ఆకాంక్షల సమాహారంగా ఆయన భారతదేశాన్ని చూస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ అలాగే చూశారు. ఇందులో భాగంగానే రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు సంక్రమింపజేయాలని భావిస్తున్నారు. అందుకే రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచనను ఆయన తెర మీదికి తెచ్చారు.