మోడీపై పోరు: కేసీఆర్ బంగారు భారత్ స్లోగన్, తెలంగాణ మోడల్

బంగారు తెలంగాణ మాదిరిగానే బంగారు భారత్ ను నిర్మిద్దామని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. 

First Published Feb 25, 2022, 11:21 AM IST | Last Updated Feb 25, 2022, 11:21 AM IST

బంగారు తెలంగాణ మాదిరిగానే బంగారు భారత్ ను నిర్మిద్దామని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ మోడల్ తరహాలో భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే ఆసక్తిని ఆయన కనబరించారు. దేశం దారి తప్పిందని, దాన్ని దారిలో పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణను హిందీ సినిమాల నిర్మాణానికి కూడా వేదిక చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాదు ప్రపంచ నగరంగా రూపుదిద్దుకుందని ఆయన చెప్పారు తెలంగాణ ఒక్కటే అభివృద్ధి చెందితే సరిపోదని, దేశం యావత్తూ అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు. ఇందుకు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని ఆయన చెప్పారు.