Asianet News TeluguAsianet News Telugu
breaking news image

జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్: మమతా బెనర్జీకి చాలెంజ్

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర రావు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లే కనిపిస్తున్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర రావు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లే కనిపిస్తున్నారు. ఆయన జన్మదిన వేడుకల సందడి, నేతల మాటలు చూస్తుంటే అది ఖాయమని అనిపిస్తోంది. చాలా కాలంగా ఆయన BJP కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోడీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. జాతీయ రాజకీయాలకు సంబంధించి KCR అజెండా సెట్ చేశారు. అజెండా మీదనే మిగతా రాజకీయ పార్టీలు వ్యాఖ్యలు చేస్తున్నాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే అది మమతా బెనర్జీకి పెద్ద సవాల్ కానుంది. జాతీయ రాజకీయాల్లో ఆయన ముందు వరుసలోకి వచ్చే అవకాశం ఉంది.