Asianet News TeluguAsianet News Telugu

జగన్ మీద ఫైట్: చంద్రబాబుకు డోర్స్ తెరిచే ఉంచిన పవన్ కల్యాణ్

Jan 14, 2022, 11:21 AM IST
  • facebook-logo
  • twitter-logo
  • whatsapp-logo

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో పొత్తుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తలుపు తెరిచే ఉంచారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద పోరాటానికి బహుశా Chandrababu సహకారం అవసరమని Pawan Klayan భావిస్తూ ఉండవచ్చు. అందుకే, తాము TDPతో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేయకుండా సమయం వచ్చినప్పుడు ఆలోచిద్దామని తన Jana Sena కార్యకర్తలకు సూచించారు. ఇప్పటికే బిజెపితో జనసేన పొత్తులో ఉంది. పవన్ కల్యాణ్ తీరు చూస్తుంటే YS Jaganను ఓడించడానికి పక్కా వ్యూహంతోనే ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు.