జగన్ మీద ఫైట్: చంద్రబాబు యుద్ధతంత్రం ఇదీ...

వచ్చే శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ ను ఎదుర్కోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు యుద్ధతంత్రం రచించి, అమలు చేయడానికి సిద్ధమయ్యారు. 

First Published Mar 4, 2022, 11:40 AM IST | Last Updated Mar 4, 2022, 11:40 AM IST

వచ్చే శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ ను ఎదుర్కోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు యుద్ధతంత్రం రచించి, అమలు చేయడానికి సిద్ధమయ్యారు. రాబిన్ శర్మ స్థానంలోసునీల్ ను వ్యూహకర్తగా ఎంపిక చేసుకున్నారు. అదే సమయంలో ఆయన కుమారుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధపడుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించడానికి ప్రణాళిక రచించారు. ఇందులో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను భాగస్వాములను చేయడానికి పూనుకున్నారు. జగన్ ప్రభుత్వ వ్యతిరేకతను తన వైపు తిప్పుకోవడానికి తగిన వ్యూహరచన చేశారు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.