Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ రెడ్డిపై ఫైట్: పసలేని జగ్గారెడ్డి వాదన

తెలంగాణ కాంగ్రెసులో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి.

తెలంగాణ కాంగ్రెసులో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తన పోరును పతాక స్థాయికి తీసుకుని వెళ్లడానికి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ సీనియర్ నేతల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెసు పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఈ స్థితిలో జగ్గారెడ్డి పనికట్టుకుని రేవంత్ రెడ్డిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన వాదనలో పస ఉన్నట్లు కనిపించడం లేదు.