కెసిఆర్ సాబ్! ఢిల్లీ బహుత్ దూర్ హై!!
తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల ప్రణాళిక బెడిసికొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల ప్రణాళిక బెడిసికొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బిజెపిని సింగిల్ గా ఎదుర్కోవడానికి తగిన బలం కెసిఆర్ కు లేదు. ఇతర రాష్ట్రాల్లో బిఆర్ఎస్ విస్తరణ ఆషామాషీ వ్యవహారం కాదు. అదే సమయంలో ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు చాలా మంది కెసిఆర్ కు దూరమవుతున్నారు. కాంగ్రెస్ తో కలిసి జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా కూటమి కట్టాలని ఇతర ప్రాంతీయ పార్టీలు భావిస్తుండగా, అందుకు భిన్నమైన వైఖరితో కెసిఆర్ ఉన్నారు. తెలంగాణలో ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కాబట్టి జాతీయ స్థాయిలో ఆ పార్టీతో కూటమి కట్టడం వల్ల శాసనసభ ఎన్నికల్లో సమస్య తలెత్తుతుందని ఆయన భావిస్తూ ఉండవచ్చు.