Asianet News TeluguAsianet News Telugu

జగన్ కు చంద్రబాబు కౌంటర్: వలటీర్లకు విరుగుడు స్నేహమిత్రులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థను కౌంటర్ చేసేందుకు తెలుుగదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు పక్కా ప్లాన్ వేసినట్లు అర్థమవుతోంది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థను కౌంటర్ చేసేందుకు తెలుుగదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు పక్కా ప్లాన్ వేసినట్లు అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతిదాన్నీ వారి ద్వారా ప్రజల ఇళ్లకే చేరవేస్తున్నారు. దానివల్ల వాలంటీర్లు ప్రతి గ్రామంలోని ప్రతి కుటుంబంతో సంబంధాలను పటిష్టం చేసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలితాలు నేరుగా ప్రజల ఇళ్లకే చేరుతున్నాయి. దానివల్ల వైఎస్ జగన్ కు రాజకీయ ప్రయోజనం కూడా చేకూరుతుంది.