స్వగ్రామానికి దగ్గర్లో.. ఉరికి వేలాడుతూ బీజేపీ ఎమ్మెల్యే.. అట్టుడుకుతున్న రాష్ట్రం..
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి చెందిన దేవేంద్ర నాథ్ రాయ్ అనే ఎమ్మెల్యే దినాజ్‌పూర్‌లోని ఓ మార్కెట్‌లో ఉరేసుకొని చనిపోయారు.
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి చెందిన దేవేంద్ర నాథ్ రాయ్ అనే ఎమ్మెల్యే దినాజ్‌పూర్‌లోని ఓ మార్కెట్‌లో ఉరేసుకొని చనిపోయారు. సోమవారం జరిగిన ఈ ఘటన హత్యే అని బీజేపీ ఆరోపిస్తోంది. ఎమ్మెల్యే ఎందుకు ఉరేసుకున్నారన్నది మాత్రం పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే మృతిపై బీజేపీ కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 12 గంటలపాటు బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించారు. కుచ్‌బెహర్ ప్రాంతంలో బస్సులు ధ్వంసం చేశారు. రోడ్లు ఎక్కడికక్కడ దిగ్బంధించారు. మమత బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు.