కొత్తగా ఉండాలని..ఇన్ లాండ్ లెటర్ మీద పెళ్లిపత్రిక...
ఉత్తరాఖండ్ లో ఓ వ్యక్తి తన కొడుకు పెండ్లి పత్రికను ఇన్ లాండ్ లెటర్స్ మీద ప్రింట్ చేయించాడు.
ఉత్తరాఖండ్ లో ఓ వ్యక్తి తన కొడుకు పెండ్లి పత్రికను ఇన్ లాండ్ లెటర్స్ మీద ప్రింట్ చేయించాడు. ఇన్ లాండ్ లెటర్స్ ఇప్పుడు ఎక్కువగా వాడకంలో లేకపోవడంతో పదిహేను వందల పెళ్లికార్డుల కోసం ఇన్ లాండ్ లెటర్స్ సేకరించడం చాలా కష్టమైపోయిందని అతను చెప్పుకొచ్చాడు. చమోలీ జిల్లాలో ఉండే సుందరమణి మందోలి తన కొడుకు వివాహానికి ఇలా ప్రత్యేకరీతిలో ఆహ్వానించాడు.