కరోనా వైరస్ తో చనిపోయిన మొదటి భారతీయుడు
మనదేశంలో కరోనా వైరస్ ఖాతాలో మొదటి మరణం నమోదయ్యింది.
మనదేశంలో కరోనా వైరస్ ఖాతాలో మొదటి మరణం నమోదయ్యింది. త్రిపురకు చెందిన 22 యేళ్ల ఓ యువకుడు భయంకరమైన కరోనా వైరస్ బారిన పడి మలేషియా ఆసుపత్రిలో మరణించాడు. అయితే, మలేషియాలో కరోనావైరస్ కారణంగా యువకుడు మరణించిన విషయంపై ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదని త్రిపుర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ రాధా డెబ్బర్మ అన్నారు.పశ్చిమ త్రిపురలోని సెపాహిజాలా జిల్లా, బిషాల్ గర్ లోనివసించే సహజన్ మియా కొడుకు మనీర్ హుస్సేన్. కరోనా వైరస్ బారినపడి మలేషియా ఆసుపత్రిలో మరణించాడు. రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో మృతదేహాన్ని తిరిగి ఇంటికి తీసుకురావడానికి కుటుంబం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.