కరోనా డేంజర్ బెల్స్.. దేశంలో 90 లక్షలు దాటిన కేసులు.. ఢిల్లీలో థార్డ్ వేవ్...
దేశంలో కరోనా థార్డ్ వేవ్ మొదలయిందా? కరోనా ఇప్పట్లో వదిలేలా లేదా? అంటే నిజమే అంటున్నారు నిపుణులు.
దేశంలో కరోనా థార్డ్ వేవ్ మొదలయిందా? కరోనా ఇప్పట్లో వదిలేలా లేదా? అంటే నిజమే అంటున్నారు నిపుణులు. కేసుల తక్కువ వస్తున్నాయి కదా అని అజాగ్రత్తగా ఉంటే.. దెబ్బ కొడుతుందని.. ఇప్పటికే ఢిల్లీలో థార్డ్ వేవ్ స్టార్ట్ అయిందని చెబుతున్నారు. లాక్ డౌన్ తీసేయగానే నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. కరోనాకు ముందున్నట్లుగానే స్వేచ్ఛగా తిరిగేయడం, మాస్కులు ధరించకపోవడం, గెట్ టు గెదర్ లు, పెండ్లిలు, ఫంక్షన్లు యదేచ్ఛగా చేసుకోవడం, కాలుష్యం.. ఇవన్నీ ఇప్పుడు ఢిల్లీని వణికిస్తున్నాయి. నెలలోనే లక్షకు పైగా కేసులు నమోదయ్యి డేంజర్ బెల్స్ మోగించాయి. దీంతో అన్ని ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలూ తమ సరిహద్దులను మూసేశాయి. దీనికి కారణమేంటి?