తెలంగాణ గవర్నర్ కు తప్పిన ప్రమాదం... కాలు జారి కిందపడ్డ తమిళిసై
చెన్నై : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు తృటిలో ప్రమాదం తప్పింది.
చెన్నై : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. సొంత రాష్ట్రం తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తమిళిసై కాలు జారి కిందపడిపోయారు. అయితే గవర్నర్ కు ఎలాంటి గాయాలు కాలేదు. హైబ్రిడ్ రాకెంట్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేదికవైపు నడుచుకుంటూ వెళుతుండగా ఒక్కసారిగా గవర్నర్ కిందపడిపోయారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆమెను పైకి లేపారు. గాయాలేవీ కాకపోవడంతో షెడ్యూల్ ప్రకారం కార్యక్రమంలో పాల్గొన్నారు గవర్నర్ తమిళిసై.