బిజెపి పాలనలో ఇది నాలుగోసారి... తన ఇంటి రాళ్లదాడి ఘటనపై ఎంఐఎం చీఫ్ ఓవైసి


 న్యూడిల్లీ : ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసి ఇంటిపై కొందరు దుండగులు రాళ్ళదాడికి పాల్పడ్డారు. 

First Published Feb 20, 2023, 11:01 AM IST | Last Updated Feb 20, 2023, 11:01 AM IST


 న్యూడిల్లీ : ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసి ఇంటిపై కొందరు దుండగులు రాళ్ళదాడికి పాల్పడ్డారు. దేశ రాజధాని న్యూడిల్లీలోని అశోకా రోడ్డులో గల ఓవైసి ఇంటిపై ఆదివారం సాయంత్రం రాళ్లదాడి జరిగింది. ఈ దాడి సమయంలో ఓవైసితో పాటు కుటుంబసభ్యులెవ్వరూ ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇంటి కిటికీ అద్దాలు మాత్రమే పగిలాయి. 

తన ఇంటిపై జరిగిన దాడిపై అసదుద్దీన్ ఆందోళన వ్యక్తం చేసారు. 2014 నుండి ఇప్పటివరకు తన ఇంటిపై దాడి జరగడం నాలుగోసారి అని పేర్కొన్నారు. జైపూర్ నుండి తిరిగివస్తుండగా ఇంటిపై దాడి జరిగినట్లు సమాచారం అందిందని... రాత్రి 11 గంటల సమయంలో ఇంటికివెళ్లి చూడగా కిటికీ పగిలి రాళ్ళు పడివున్నాయని అన్నారు. అసదుద్దీన్ పిర్యాదుతో అదనపు డీసీపీ ఆద్వర్యంలో డిల్లీ పోలీసుల బృందం ఘటనాస్ధలికి చేరుకుని ఆధారాలు సేకరించారు.  నిందితులను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని అసదుద్దిన్ డిమాండ్ చేసారు.