Solar Eclipse : చిన్నారిని మట్టిలో పాతిన తల్లిదండ్రులు..ఎందుకంటే...
సూర్యగ్రహణం సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది.
సూర్యగ్రహణం సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. సూర్యగ్రహణం సమయంలో మట్టిలో పాతి పెడితే చిన్నారుల అంగవైకల్యం పోతుందని ఎవరో చెప్పిన మాటలు నమ్మి తమ కన్నకొడుకును మూడు గంటలపాటు మట్టిలో పాతారు ఓ తల్లిదండ్రులు. ఈ ఘటన ఉత్తర కర్ణాటకలోని తాజ్‌సుల్తాన్‌పురాలో జరిగింది. ఉత్తర కర్ణాటక అంతటా ఇదే మూఢాచారం కొనసాగుతోందని తెలుస్తోంది. అయితే ఈ ఘటన పై జన విజ్ఞాన వేదిక అసహనం వ్యక్తం చేసింది.