Asianet News TeluguAsianet News Telugu

అంబానీల ఇంట పెళ్లి సంబరాలు... ముకేష్-నీతా దంపతుల అదిరేటి స్టెప్పులు చూడండి...

ముంబై : భారతదేశంలోనే అత్యంత సంపన్న కుటుంబం అంబానీల ఇంట ఆనందాలు వెల్లివిరిసాయి. 

ముంబై : భారతదేశంలోనే అత్యంత సంపన్న కుటుంబం అంబానీల ఇంట ఆనందాలు వెల్లివిరిసాయి. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా దంపతుల కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థం ఐకానిక్ బిల్డింగ్ అంటెలియాలో అత్యంత వైభవంగా జరిగింది. అంబానీ కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో గుజరాతీ సాంప్రదాయం ప్రకారం అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ నిశ్చితార్థం కన్నులపండగగా జరిగింది. ఈ నిశ్చితార్థంలో ప్రత్యేక వినోద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంత్ తల్లి నీతా అంబానీ నేతృత్వంలో అంబానీ కుటుంబ సభ్యులు చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఉర్రూతలూగించింది. ముకేశ్‌‌-నీతా, అనంత్ - రాధికా జోడి నృత్యాలు అతిథులను ఆకట్టుకున్నారు.