Asianet News TeluguAsianet News Telugu

అమిత్ షా పర్యటన ట్విస్ట్: పొలిటికల్ ఎంట్రీపై రజనీకాంత్ తేల్చేనా?

సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులతో సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. 

సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులతో సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. రజినీకాంత్ ఈ రోజు తన అభిమానులతో సమావేశమవుతున్నారు. 38 మంది జిల్లాల నుంచి వచ్చిన తన అభిమాన సంఘం కార్యదర్శులతో ఆయన బేటీ అవుతారు. కేంద్ర హోం శాఖ మంత్రి, బిజెపి నేత ఇటీవల తమిళనాడులో పర్యటించిన నేపథ్యంలో రాజకీయాలపై రజినీకాంత్ ట్విస్ట్ ఇచ్చాడని అంటున్నారు. రజినీకాంత్ తో భేటీ పెద్ద యెత్తు అభిమానులు ఇప్పటికే చేరుకున్నారు. రాజకీయాల్లోకి రావాలని దేవుడు రజినీకాంత్ ను ఆదేశించాడా, లేదా చూడాల్సిందే.