లడఖ్ లో మోడీ ఆకస్మిక పర్యటన..ఎందుకంటే..!

ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు ఉదయం లడఖ్ లోని సరిహద్దుల్లో ఆకస్మిక పర్యటన చేసారు.

First Published Jul 3, 2020, 1:06 PM IST | Last Updated Jul 3, 2020, 1:06 PM IST

ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు ఉదయం లడఖ్ లోని సరిహద్దుల్లో ఆకస్మిక పర్యటన చేసారు. అయితే ప్రధాని షెడ్యూల్ లో లేని ఈ పర్యటనకు ముందుగానే రహస్య ఏర్పాట్లు జరిగినట్టు తెలుస్తోంది. ఈ పర్యటనలో ప్రధానితో పాటు త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కూడా ఉన్నారు. దేశం కోసం పోరాడుతున్న సైనికుల్లో మనోస్థైర్యాన్ని నింపడానికి ప్రధాని లడఖ్ సరిహద్దులో పర్యటించారు. ప్రస్తుతం ఆయన లేహ్ లో పర్యటిస్తున్నారు. మోదీ పర్యటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడే సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. వీడియోలో  మోడీ కూడా సైనికుల దుస్తుల్లోనే ఉన్నారు. కరోనా భయాన్ని విడిచి ఆయన సైనికులకు కరచాలనం చేస్తున్నారు. అంతే కాకుండా సైనికులకు సెల్యూట్ చేసి, వారి భుజాలు తడుతూ అభినందించారు. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో మోడీ అకస్మాత్తుగా సరిహద్దుల్లో పర్యటించటం గమనార్హం.