ఉక్రెయిన్ రష్యా యుద్ధం : వారణాసిలో విద్యార్ధులతో ప్రధాని మోడీ సమావేశం
ఉక్రెయిన్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వారణాసిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ అనుభవాలను ఆయనతో పంచుకున్నారు.
ఉక్రెయిన్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వారణాసిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ అనుభవాలను ఆయనతో పంచుకున్నారు. విద్యార్థులు వారణాసితో పాటు ఉత్తరప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాలకు చెందినవారు. ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ అడ్వైజరీలు జారీ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 17,000 మంది భారతీయ పౌరులు స్వదేశానికి చేరుకున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన మిగిలిన విద్యార్థులను తరలించడానికి వీలుగా ఆపరేషన్ గంగా కింద విమానాల సంఖ్యను కేంద్రం పెంచింది.
అంతకుముందు ఆపరేషన్ గంగలో భాగమైన భారత వాయుసేనకు చెందిన రెండు సీ-17 విమానాలు 420 మందితో గురువారం ఢిల్లీకి చేరాయి. రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి 200 మందితో ఒక విమానం, హంగెరీ రాజదాని బుడాపెస్ట్ నుంచి 220 మందితో మరో సీ-17 విమానం ఢిల్లీలోని హిండన్ ఎయిర్ బేస్‌కి చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులకు కేంద్ర మంత్రులు అజయ్ భట్, రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. కాగా, మరో 300 మందితో కూడిన మూడు సీ-17 విమానాలు గురువారం ఉదయం 8 గంటలకు ఢిల్లీకి చేరుకుంటాయని కేంద్ర విదేశాంగ శాఖ వర్గాలు చెబుతున్నాయి.