ప్రధాని నివాసంలో దేశంలోని సిక్కు ప్రముఖులకు ఆతిథ్యం

ప్రధాని narendra modi తన నివాసంలో దేశంలోని sikh ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చారు. 

First Published Feb 18, 2022, 12:13 PM IST | Last Updated Feb 18, 2022, 12:16 PM IST

ప్రధాని narendra modi తన నివాసంలో దేశంలోని sikh ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా సిక్కు ప్రముఖులు ప్రధానితో కాసేపు ముచ్చటించారు. సిక్కుల సాంస్కృతి చిహ్నం ముద్రించిన ఉన్న ఆరెంజ్ కలర్ టర్బన్, కత్తిని ప్రధానికి బహూకరించారు. శాలువా కప్పి సత్కరించారు. ఆ తరువాత ప్రధానితో చాలాసేపు ముచ్చటించారు. ప్రధానిని కలిసిన వారిలో ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు,హర్మీత్ సింగ్ కల్కా,పద్మశ్రీ బాబా బల్బీర్ సింగ్ జీ సిచేవాల్ (సుల్తాన్‌పూర్ లోధి), మహంత్ కరంజిత్ సింగ్, ప్రెసిడెంట్ సేవాపంతి, యమునా నగర్, బాబా జోగా సింగ్, డేరా బాబా జంగ్ సింగ్ (నానక్సర్) కర్నాల్, సంత్ బాబా మేజోర్ సింగ్ వా, ముఖి డేరా బాబా తారా సింగ్ వా, అమృత్సర్, జతేదార్ బాబా సాహిబ్ సింగ్ జీ, కర్ సేవా ఆనంద్‌పూర్ సాహిబ్, సురీందర్ సింగ్ నాంధారి దర్బార్ (భేని సాహిబ్), బాబా జస్సా సింగ్ శిరోమణి అకాలీ బుధ దళ్, పంజ్వా తఖ్త్, డాక్టర్ హర్భజన్ సింగ్, దామ్‌దామి తక్సల్, చౌక్ మెహతా సింగ్ సాహిబ్ గియాని రంజిత్ సింగ్ జీ, జాతేదార్ తఖ్త్ శ్రీ పాట్నా సాహిబ్ లు ఉన్నారు.