కోయంబత్తూరు కారు బ్లాస్ట్ కేసు... 3 రాష్ట్రాలు, 60 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

న్యూడిల్లీ :  కోయంబత్తూరు కారు పేలుడు కేసులో ఎన్ఐఎ విచారణను వేగవంతం చేసింది.

First Published Feb 15, 2023, 12:27 PM IST | Last Updated Feb 15, 2023, 12:27 PM IST

న్యూడిల్లీ :  కోయంబత్తూరు కారు పేలుడు కేసులో ఎన్ఐఎ విచారణను వేగవంతం చేసింది. ఇవాళ ఉదయమే తమిళనాడుతో పాటు కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని అనుమానిత ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. ఇలా మూడు రాష్ట్రాల్లో 60 చోట్ల ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. 

  గతేడాది అక్టోబర్ 23న జమేషా ముబీన్ అనే అనుమానిత ఉగ్రవాది కోయంబత్తూరులోని కొట్టాయి ఈశ్వరన్ ఆలయంవద్ద కారు సిలిండర్ పేలి మృతిచెందాడు. మొదట అంతా ఇది సాధారణ ప్రమాదంగానే భావించినా ముబీన్ ఇంట్లో భారీ పేలుడు పదార్థాలు లభించడంతో ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అనుమానం మొదలయ్యింది. దీంతో ఈ కేసు విచారణ  తమిళనాడు పోలీసుల నుండి ఎన్ఐఎ చేతికి వెళ్లింది. ఈ విచారణలో భాగంగానే ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.