Asianet News TeluguAsianet News Telugu

కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన: పూజలు చేసిన మోడీ

Dec 10, 2020, 3:22 PM IST

ఈ భవన నిర్మాణ పనులను పురస్కరించుకొని గురువారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ భూమి పూజ నిర్వహించారు. వచ్చే 100 ఏళ్లకు సరిపడేలా కొత్త భవనంలో సౌకర్యాలను కల్పించనున్నారు. రాజ్యసభ, పార్లమెంట్ లతో పాటు ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు పలువురు మంత్రుల కార్యాలయాలను కూడ ఏర్పాటు చేయనున్నారు. 2022 చివరి వరకు  పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంది.