Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక క్రైసిస్:ఇక్కడ ఇది కొత్తేం కాదు (వీడియో)

కర్ణాటక అసెంబ్లీలో జరుగుతున్న బలనిరూపణ పరీక్ష పూటకో మలుపులు తిరుగుతుంది. రెండు రోజులుగా ఇదే అంశంపై అసెంబ్లీలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. అయితే కర్ణాటకలో బలనిరూపణ పరీక్షలు కొత్తేం కాదు. ఎస్ఎం కృష్ణ పిరియడ్ అయిపోయిన తర్వాత అంటే 2004లో ఇదే పరిస్థితి నెలకొంది. ధరమ్ సింగ్ ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయిన తర్వాత ఇలాంటి పరిస్థితే నెలకొంది. 

కర్ణాటక అసెంబ్లీలో జరుగుతున్న బలనిరూపణ పరీక్ష పూటకో మలుపులు తిరుగుతుంది. రెండు రోజులుగా ఇదే అంశంపై అసెంబ్లీలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. అయితే కర్ణాటకలో బలనిరూపణ పరీక్షలు కొత్తేం కాదు. ఎస్ఎం కృష్ణ పిరియడ్ అయిపోయిన తర్వాత అంటే 2004లో ఇదే పరిస్థితి నెలకొంది. ధరమ్ సింగ్ ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయిన తర్వాత ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇకపోతే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ సైతం ఒడుదుడుకులు ఎదర్కొంది. ఐదేళ్ల టెర్మ్ లో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది. సుస్థిర పాలన అందించడంలో విఫలమైంది. ప్రస్తుతం అంతకంటే హాట్ హాట్ గా కర్ణాటక రాజకీయాలు జరుగుతున్నాయి. కుమార స్వామి ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అన్న దానిపై సస్పెన్షన్ మాత్రం వీడటం లేదు.