Asianet News TeluguAsianet News Telugu

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే అరెస్ట్ విజువల్స్ (వీడియో)

యూపీలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దుబేను ఉజ్జయిని మహాకాళి ఆలయం సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. 

యూపీలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దుబేను ఉజ్జయిని మహాకాళి ఆలయం సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న కిరాతక రౌడీని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారని యూపీ పోలీస్ వర్గాలు తెలిపాయి. జూలై 3న కాన్పూర్ సమీపంలోని చౌబేపూర్ పోలీస్ స్టేషన్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిది. రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసులు చనిపోయారు. వీరిలో డీఎస్పీతో పాటు ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే, అతడి అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

Video Top Stories