హైదరాబాద్ లోనే కరోనా వ్యాక్సిన్... త్వరలోనే అందుబాటులోకి..

కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని షట్ డౌన్ చేసిన సూక్ష్మజీవి. 

First Published Jul 6, 2020, 5:42 PM IST | Last Updated Jul 6, 2020, 5:42 PM IST

కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని షట్ డౌన్ చేసిన సూక్ష్మజీవి. ప్రపంచదేశాల్ని అల్లాడిస్తోంది. ఆర్థిక వ్యవస్థల్ని కుదేలు చేస్తుంది. మానవజీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ 188 దేశాలకు పాకింది. ప్రస్తుతం 6 లక్షల, 97వేల 413 పాజిటివ్‌ కేసులతో అత్యధిక కేసులు నమోదైన దేశాలలో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాలలోనూ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. దీన్ని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. అందుకే అందరి చూపు వ్యాక్సిన్ వైపై ఉంది. ఈ సమయంలో భారత్ బయోటెక్ సంస్థ ఆగస్ట్ 15లోపు వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని చెప్పడంతో అందరిలోనూ కొత్త ఉత్సహం ఊపిరి పోసుకుంటోంది.