ప్రమాదవశాత్తు జారి లోయలో పడ్డ పర్వతారోహకుడ్ని కాపాడిన భారతీయ వాయుసేన

ర్ణాటక రాష్ట్రంలోని నంది హిల్స్ లో ఔత్సాహిక పర్వతారోహకుడు ప్రమాదవశాత్తు 200 ఫీట్ల లోతైన లోయలో పడిపోయాడు. 

First Published Feb 21, 2022, 10:19 AM IST | Last Updated Feb 21, 2022, 10:19 AM IST

ర్ణాటక రాష్ట్రంలోని నంది హిల్స్ లో ఔత్సాహిక పర్వతారోహకుడు ప్రమాదవశాత్తు 200 ఫీట్ల లోతైన లోయలో పడిపోయాడు. ఢిల్లీకి చెందిన ఈ 19 సంవత్సరాల కుర్రాడు బెంగళూరులోని ఇంజనీరింగ్ కాలేజీ లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు. నంది హిల్స్ లో పర్వతారోహణకు వచ్చిన ఈ కుర్రాడు ప్రమాదవశాత్తు జారిపడిపోవడంతో అతడ్ని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థకు సంబంధించిన సిబ్బంది ఎయిర్ ఫోర్స్ కలిసి రక్షించాయి. అతడు లోయలో పడ్డ తరువాత పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు విపత్తు నిర్వహణా సంస్థ బృందంతో చేరుకున్నప్పటికీ... వారు అతడ్ని పైకి తీసుకురాలేకపోయారు. దీనితో వాయుసేనకు సమాచారం అందించడంతో వారు ఒక హెలికాప్టర్ సహాయంతో వారు ఆ యువకుడ్ని కాపాడారు.