నదిలో పడిన మంత్రి : తెలిసొచ్చిన స్థానికుల కష్టాలు (వీడియో)
కేంద్ర మాజీ మంత్రి, పాటలీపుత్ర ఎంపీ రామ్ కృపాల్ యాదవ్‌కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. తన నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ట్యూబ్ల బోటులో ప్రయాణిస్తున్న ఆయన.. అదుపు తప్పి నదిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఎంపీని రక్షించారు.

ఎంపీ కృపాల్ యాదవ్ బుధవారం రాత్రి వరదలతో అతలాకుతలమైన బీహార్ లోని ధనురువా గ్రామ పరిశీలనకు వెళ్లారు. నదికి అవతలి గట్టున్న ప్రాంతాన్ని పరిశీలించాలనుకున్నారు. పడవ అందుబాటులో లేకపోవడంతో.. గ్రామస్థులు ఉపయోగించే టైర్ ట్యూబుల పడవలో బయలుదేరారు. ఆయనతో పాటు ఇంకొంతమంది ఎక్కడంతో అదుపుతప్పి నీటిలో పడిపోయారు. వెంటనే స్థానికులు అలర్ట్ అయ్యి.. ఆయన్ను సురక్షితంగా వెలికి తీశారు.