కరోనా ఎఫెక్ట్ : హోలీ ఆడితే వైరస్ సోకుతుందనే భయం..తగ్గిన అమ్మకాలు...
కరోనా వైరస్ భయంతో దేశవ్యాప్తంగా హోలీ వ్యాపారం దెబ్బతింది.
కరోనా వైరస్ భయంతో దేశవ్యాప్తంగా హోలీ వ్యాపారం దెబ్బతింది. ముంబై, జమ్ము, చత్తీస్ ఘడ్ లలో వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలు స్వచ్ఛందంగా హోలీకి దూరంగా ఉండడంతో అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. గతేడాదితో పోల్చితే ఈ యేడు హోలీ బిజినెస్ 50 శాతానికంటే తక్కువకు పడిపోయిందని వ్యాపారులు వాపోతున్నారు.