Asianet News TeluguAsianet News Telugu

యే దోస్తీ హమ్ నహీ తోడేంగె... దిగ్విజయ్ సింగ్ మాస్ డ్యాన్స్

మహారాష్ట్ర : మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ మాస్ డ్యాన్స్ తో అదరగొట్టాడు. 

మహారాష్ట్ర : మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ మాస్ డ్యాన్స్ తో అదరగొట్టాడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో పేరిట చేపట్టిన పాదయాత్ర మహారాష్ట్రలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ పాదయాత్రలో పాల్గొన్న దిగ్విజయ్ రాత్రి బసచేసిన ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి సరదాగా గడిపారు. ఈ సందర్భంగా 'యే దోస్తీ... హమ్ నహీ తోడెంగె' అంటూ సాగే హిందీ పాటకు ఇతర నాయకులతో కలిసి డ్యాన్స్ చేసారు డిగ్గి రాజా.