హిమాచల్ లో కుంభవృష్టి... బియాస్ నది ఉదృతిలో కొట్టుకుపోయిన భవనం
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదనీటితో నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలా నదులు, నీటి ప్రవాహాల్లో వున్న నిర్మాణాలు కొట్టుకుపోతున్నాయి. ఇలా కులు జిల్లాలోని మనాలి పట్టణంలో వరద నీటితో ఉదృతంగా ప్రవహిస్తున్న బియాస్ నది ఓ భవనాన్ని తరలో కలిపేసుకుంది. బియాస్ నది ఒడ్డునగల భవనం అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలి వరదనీటిలో కొట్టుకుపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.