ఫార్మసి స్టూడెంట్ తేజస్విని మృతిపై సిట్ ఏర్పాటు...: డిజిపికి బిజెపి డిమాండ్

అమరావతి: శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల బి ఫార్మసి స్టూడెంట్ తేజస్విని అనుమానాస్పద మృతిపై నిస్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపించాలని బిజెపి నాయకులు డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని కోరారు. ఈ మేరకు పీ బీజేపీ ప్రధాన కార్యదర్శి యస్. విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో బిజెపి నేతల బృందం ఇవాళ(సోమవారం) డిజిపిని కలిసి వినతిపత్రం సమర్పించారు. డిజిపిని కలిసిన తర్వాత విష్ణువర్ధన్ మాట్లాడుతూ... తేజస్విని ఆత్యాచారం, హత్య ఘటనపై సిట్ ఏర్పాటు చేయాలని డిజిపిని కోరామన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న బాధిత కుటుంబాలకు హెచ్చరికలు, బెదిరింపు కాల్స్ వస్తున్నాయని... కాబట్టి తేజస్విని కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలని డిజిపిని కోరామన్నారు. తేజస్విని కుటుంబసభ్యులకు పూర్తి న్యాయం జరిగే వరకు బిజెపి పోరాడుతుందని విష్ణువర్ధన్ అన్నారు. 

First Published May 9, 2022, 2:13 PM IST | Last Updated May 9, 2022, 2:13 PM IST