Video news : జూట్, పేపర్ బాగ్స్ వినియోగాన్ని పెంచేందుకు చర్యలు
కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అధ్యక్షతన ఢిల్లీలో అన్ని రాష్ట్రాల అటవీ, పర్యావరణ శాఖ మంత్రుల సమావేశం జరిగింది.
కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అధ్యక్షతన ఢిల్లీలో అన్ని రాష్ట్రాల అటవీ, పర్యావరణ శాఖ మంత్రుల సమావేశం జరిగింది.మహారాష్ట్ర సదన్ లో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హాజరయ్యారు. కంపా నిధుల వినియోగం, పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరిగింది.