ఆరె వివాదం కథాకమామీషు (వీడియో)
ఆరె ఫారెస్టుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇంటెరిమ్ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. తరువాత ఆర్డర్లు వచ్చేవరకు ఆరెఫారెస్ట్ లోని చెట్లను కొట్టకూడదని స్టే విధించింది. బాంబే హైకోర్టు మెట్రో లోకో షెడ్ కట్టడానికి ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ ని తాత్కాలికంగా నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది.

బాంబేలోని ఆరె ఫారెస్టులో 30 ఆదివాసీ గ్రామాలు నివసిస్తున్నాయి. దీన్ని కొట్టేయడం వల్ల బాంబే ప్రాణవాయువు తీసేసినట్టేనని నిరసనకారులు అంటున్నారు. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ నోయిడాకు చెందిన కొందరు విద్యార్థులు ఆరె ఫారెస్ట్ కొట్టివేతను సుమోటోగా స్వీకరించాలని రంజన్ గొగోయ్ కి ఒక లేఖ రాశారు. వారు రాసిన ఈ లేఖనే ఈ లేఖనే సుమోటోగా, పిల్ గా పరిగణిస్తూ రంజన్ గొగోయ్ ఈ తీర్పు వెలువరించారు.