Asianet News TeluguAsianet News Telugu

నన్నే ఆపుతావా.. లేడీ కానిస్టేబుల్ పై ఎమ్మెల్యే కొడుకు దౌర్జన్యం..

గుజరాత్ లో తన డ్యూటీ సక్రమంగా చేసినందుకు ఓ లేడీ కానిస్టేబుల్ ట్రాన్స్ ఫర్ ను బహుమానంగా అందుకుంది. 

గుజరాత్ లో తన డ్యూటీ సక్రమంగా చేసినందుకు ఓ లేడీ కానిస్టేబుల్ ట్రాన్స్ ఫర్ ను బహుమానంగా అందుకుంది. వివరాల్లోకి వెడితే లాక్ డౌన్ సమయంలో బిజేపీ ఎమ్మెల్యే కొడుకు, తన ఇద్దరు స్నేహితులతో ఎలాంటి కరోనా జాగ్రత్తలు లేకుండా 
వెడుతుంటే సునిత యాదవ్ అనే కానిస్టేబుల్ అడ్డుకుంది.  దీంతో అతని స్నేహితులు ఎమ్మెల్యే కొడుకు ఆయన అంటూ చెప్పబోయారు.. దీంతో సునిత నా డ్యూటీ చేస్తున్నాను.. నేను మీ బానిసను కాదంటూ సమాధానం ఇచ్చింది. దీంతో ఆమెను అక్కడినుండి ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆర్డర్స్ అందుకోవాల్సి వచ్చింది.