హోరాహోరీగా బోట్‌ రేస్‌ మైక్రో సెకన్ల తేడాతో విజయం

కేరళలో 70వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ హోరాహోరీగా సాగింది. అలప్పుజాలోని ప్రశాంతమైన పున్నమడ సరస్సులో జరిగిన బోట్‌ రేస్‌లో 19 చుండన్ బోట్లతో సహా 72 బొమ్మ పడవలు పాల్గొన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీనే జరగాల్సిన ఈ పోటీలు వాయనాడ్‌ విపత్తు కారణంగా వాయిదా పడ్డాయి. ఏటా ఆగస్టు రెండో శనివారం జరిగే ఈ పోటీలు ఈసారి దాదాపు నెలన్నర రోజుల తర్వాత మొదలవగా.. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగాయి. ఈ పోటీలను చూసేందుకు దేశవిదేశాల నుంచి భారీగా సందర్శకులు తరలి వచ్చారు. కాగా, మైక్రో సెకన్ల తేడాతో ఈ పోటీలో జట్లు విజయం సాధించాయి. పల్లతురుత్తి బోట్‌ క్లబ్‌ (పీసీబీ)కి చెందిన కరిచల్‌ చుండన్‌ విలేజ్‌ బోట్‌ క్లబ్‌ విజయం..  కైనకరి వీయపురం చుండన్‌ జట్టుపై విజయం సాధించింది. విజేత కరిచల్ చుండన్‌ సమయం 4.29.78.5 గంటలు కాగా, రన్నరప్‌ జట్టు వీయపురం సమయం 4.29.79.0 గంటలు. ఇది పీబీసీకి వరుసగా 5వ విజయం కాగా, కరిచల్ చుండన్ బోట్‌కు 16వ చారత్రక విజయం.

First Published Sep 30, 2024, 9:02 AM IST | Last Updated Sep 30, 2024, 9:02 AM IST