Asianet News TeluguAsianet News Telugu

హ్యాపీ బర్త్‌డే :సవాళ్లకు స్వాగతం చెబుతూ సాగుతున్న సత్య నాదెళ్ల (వీడియో)

కంప్యూటర్ గురించి తెలిసిన వారికి ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ప్రముఖ మైకోసాఫ్ట్ కంపెనీకి 2014 ఫిబ్రవరి 4వ తేదీన సత్య నాదెళ్ల సీఈఓ నియమితులయ్యారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం బక్కాపురం గ్రామంలో సత్యనాదెళ్ల 1967లో  పుట్టాడు.

తండ్రి 1962 బ్యాచ్ ఐఎఎస్ అధికారి యుగంధర్.2004 నుండి 2009 వరకు కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యుడిగా, ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేశారు.సత్య నాదెళ్ల ప్రాథమిక విద్యాభ్యాసం హైద్రాబాద్‌లో సాగింది. హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్ క్రికెట్ జట్టు సభ్యుడిగా ఆయన ఉన్నాడు. లీడర్‌షిప్ క్వాలిటీస్ ను క్రికెట్ నుండి నేర్చుకొన్నట్టుగా ఆయన చెబుతారు. 2013లో హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్ 90వ వార్షికోత్సవంలో సత్య నాదెళ్ల పాల్గొన్నారు.

అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్శిటీ నుండి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ, చికాగో యూనివర్శిటీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్  మాస్టర్స్ డిగ్రీ చేశారు. 1992లో మైక్రోసాఫ్ట్ లో ఆయన అడుగుపెట్టారు.