సేవా యూరోప్ ఆర్గనైజషన్..ఉక్రెయిన్ లో భారతీయ విద్యార్థులు తరలింపులో వీరి పాత్ర మరువలేనిది...

ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తరలించడానికి మోడీ ప్రభుత్వ్యం ఆపరేషన్ గంగ చేపట్టిన విషయం తెలిసిందే..

First Published Mar 12, 2022, 3:55 PM IST | Last Updated Mar 12, 2022, 3:55 PM IST

ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తరలించడానికి మోడీ ప్రభుత్వ్యం ఆపరేషన్ గంగ చేపట్టిన విషయం తెలిసిందే..ఇప్పటికే చాలా మంది విద్యార్థులను ఉక్రెయిన్ లో నుండి ఎంతో శ్రమకోర్చి పోలాండ్ సరిహద్దుకు చేర్చి అక్కడినుండి స్వదేశం తరలించారు...ఈ ప్రక్రియలో అక్కడి భారతీయ ఎంబసీ కొన్ని స్వచ్చంద సంస్థల సహకారం కూడా తీసుకుంది..పోలాండ్ బోర్డర్ కి తరలించిన విద్యార్థులు కు కావాల్సిన బస, ఆహరం మొదలైన ఏర్పాట్లను చెయ్యటం లో  అక్కడ వాలంటీర్లు  చేసిన సహకారం మరువలేనిది..అక్కడ మన విద్యార్థులకు సహకరించి స్వచ్చంద సంస్థల్లో ముఖ్యమైనది సేవా యూరోప్ ఆర్గనైజషన్..ఆ సంస్థకు చెందిన వాలంటీర్లు  ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చే విద్యార్థులకు అవసరమైన నీరు, ఆహారం అందించి బోర్డర్ కు చేరినందుకు వారి వంతు సహకారం అందిస్తున్నారు... ఆ సంస్థ వాలంటీర్లతో ఉక్రెయిన్ యుద్ధం వార్తలను కళ్ళకు కట్టినట్టు  మనకు ఎప్పటికప్పుడు అందించడానికి అక్కడే బస చేసిన ఏసియానెట్ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ రఘువంశం ముచ్చటించడం జరిగింది. ఆ వీడియో ఎక్స్ క్లూజివ్ గా మీకోసం...