ఖార్కివ్ నుండి కిలోమీటర్ల దూరం నడిచి...గంటలకొద్దీ ప్రయాణం చేసి...

యుద్ధం మానవ జీవితాలను ఎంత ఛిద్రం చేస్తుందో ఉక్రెయిన్ పరిస్థితి చూస్తే అర్థం అవుతుంది.

First Published Mar 7, 2022, 10:24 AM IST | Last Updated Mar 7, 2022, 10:24 AM IST

యుద్ధం మానవ జీవితాలను ఎంత ఛిద్రం చేస్తుందో ఉక్రెయిన్ పరిస్థితి చూస్తే అర్థం అవుతుంది...ఉక్రెయిన్ స్థానికులతో పాటు, ఎన్నో ఆశలతో ఉన్నత చదువులకోసం అక్కడ అడుగుపెట్టిన భారతీయ విద్యార్థులు కష్టాలు చెప్పనలవి కాదు...మోడీ ప్రభుత్వం వేగంగా స్పందించి అక్కడినుండి మన విద్యార్థులు వెనక్కి తీసుకురావడానికి ఆపరేషన్ గంగ పేరుతో ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి వారిని తరలిస్తున్న విషయం తెలిసిందే...అలాగే అక్కడ జరిగే యుద్ధ వార్తలు ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్టు  అందేంచేందుకు ఏసియానెట్ ప్రతినిధి ప్రశాంత్ రఘువంశం అక్కడే మకాం చేసి తాజా పరిస్థితులను మీకు అందిస్తున్నారు. ఆయన అక్కడ ఉక్రెయిన్ నుండి పోలాండ్ బోర్డర్ కి చేరుకున్న విద్యార్థులతో మాట్లాడి వారు ఎదుర్కున్న పరిస్థితులను తెలుసుకోవడం జరిగింది. ఆ వీడియో ప్రత్యేకం గా ఆసియానెట్ ప్రేక్షకుల కోసం...