అంత దారుణమైన పరిస్థితుల్లో ఏమీ లేను.. శివపార్వతి యూ టర్న్..
నేను చావుబతుకుల్లో ఉన్నాను కాపాడమంటూ నేనెవ్వరినీ వేడుకోలేదు, అంత దారుణమైన పరిస్థితుల్లో నేను లేను అంటూ వదినమ్మ సీరియల్ నటి శివపార్వతి మరో వీడియో రిలీజ్ చేసింది.
నేను చావుబతుకుల్లో ఉన్నాను కాపాడమంటూ నేనెవ్వరినీ వేడుకోలేదు, అంత దారుణమైన పరిస్థితుల్లో నేను లేను అంటూ వదినమ్మ సీరియల్ నటి శివపార్వతి మరో వీడియో రిలీజ్ చేసింది. తనకు కరోనా వచ్చినా పట్టించుకునేవారే కరువయ్యారని ఇటీవలే ఆమె విడుదల చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిమీద ఆ సీరియల్ నటుడు, నిర్మాత ప్రభాకర్ ఇదంతా ఓ చిన్న పొరపాటు వల్లే జరిగిందని వివరణ కూడా ఇచ్చారు.