హీరో నితిన్ పెళ్లి : కేసీఆర్ కు శుభలేఖ.. వచ్చి ఆశీర్వదించాలని కోరిన హీరో..
ఈనెల 26న హీరో నితిన్ పెళ్లి చేసుకోబోతోన్నాడు ఏప్రిల్ 16న దుబాయ్‌లో జరగాల్సిన వీరి వివాహం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది.
ఈనెల 26న హీరో నితిన్ పెళ్లి చేసుకోబోతోన్నాడు ఏప్రిల్ 16న దుబాయ్‌లో జరగాల్సిన వీరి వివాహం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. సుమారు నాలుగు నెలల తరువాత ఈనెల 26న నితిన్ పెళ్లి జరగబోతోంది. ఈ వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హీరో నితిన్ తన తండ్రి సుధాకర్ రెడ్డితో కలిసి ప్రగతి భవన్‌కు వెళ్లి ఆహ్వానించారు. తన వివాహానికి హాజరై ఆశీర్వదించాలని కోరారు. తాను వస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్టు సమాచారం. హైదరాబాద్‌లో 26వ తేదీ రాత్రి 8.30 గంటలకు షాలినితో కలిసి ఏడడుగులు వేయబోతున్నారు నితిన్. ప్రస్తుతం హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి నితిన్, షాలిని వివాహ వేడుకను నిర్వహించనున్నారు.