సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్, కారణమిదే...
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య కేసు ఓ కొత్త మలుపు తిరిగింది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య కేసు ఓ కొత్త మలుపు తిరిగింది. సుశాంత్ సింగ్ రాజ్ పూత్ తండ్రి కెకె సింగ్ సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి ఆమె ముగ్గురు కుటుంబ సభ్యులతో సహా మరో ఐదుగురిపై పాట్నా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పక్కా ప్లాన్ ప్రకారం కుట్ర చేసి రియా, ఆమె కుటుంబం సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని అందులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు వీరిమీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.