సమంత ఛాలెంజ్‌ను స్వీకరించిన శిల్పారెడ్డి..
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సమంత ఈ ఛాలెంజ్‌కు తన ఫ్రెండ్ శిల్పారెడ్డి, హీరోయిన్స్ రష్మిక, కీర్తిసురేష్‌లను నామినేట్ చేశారు.
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సమంత ఈ ఛాలెంజ్‌కు తన ఫ్రెండ్ శిల్పారెడ్డి, హీరోయిన్స్ రష్మిక, కీర్తిసురేష్‌లను నామినేట్ చేశారు. సమంత ఇచ్చిన ఈ ఛాలెంజ్‌ను ఆమె ఫ్రెండ్ శిల్పారెడ్డి స్వీకరించారు. ఇటీవలే కరోనాని జయించిన ఆమె.. ఎంతో హుషారుగా ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. మూడు మొక్కలు నాటిన శిల్పారెడ్డి.. ఈ ఛాలెంజ్‌కు ఉపాసన కొణిదెల, సుస్మిత కొణిదెల, మంచు లక్ష్మీ, సామ్రాట్‌లను నామినేట్ చేశారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న సంతోష్ కుమార్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.