గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : కూతురికే ఛాలెంజ్ విసిరిన రేణూ దేశాయ్..
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు తన కూతురు, కూతురి స్నేహితురాలితో కలిసి జూబ్లీహిల్స్ లోని పార్కు లో హీరోయిన్ రేణు దేశాయ్ మొక్కలు నాటారు.
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు తన కూతురు, కూతురి స్నేహితురాలితో కలిసి జూబ్లీహిల్స్ లోని పార్కు లో హీరోయిన్ రేణు దేశాయ్ మొక్కలు నాటారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి అభినందనలు తెలియజేశారు. తన కూతురు వయసు వారికి మొక్కలు ఎలా నాటుతారో తెలియదని అందుకే తన కూతురికి, ఆ వయసు పిల్లలందరికీ ఈ ఛాలెంజ్ అన్నారు. అంతేకాదు తాను ముగ్గురిని కాదు ప్రతి ఒక్కర్నీ నామినేట్ చేస్తున్నా అన్నారు. అందరూ దీన్ని స్వచ్ఛందంగా స్వీకరించి మొక్కలు నాటాలని అన్నారు.