Asianet News TeluguAsianet News Telugu

రథేరా మూవీ ట్రైలర్ ను ఆవిష్కరించిన డైరెక్టర్ వి వి వినాయక్ (వీడియో)

పూల సిద్దేశ్వర రావు హీరోగా పరిచయమవుతున్న చిత్రం రథేరా. జాకట్ రమేష్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పూల సిద్దేశ్వర రావు, నరేష్ యాదవ్, వై ఎస్ కృష్ణమూర్తి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ ఇటీవల తన కార్యాలయం లో విడుదల చేశారు . ఈ కార్యక్రమంలో హీరో పూల సిద్దేశ్వర రావు, దర్శకుడు జాకెట్ రమేష్, నిర్మాత వై ఎస్ కృష్ణమూర్తి, నరేష్ యాదవ్, నీనోరకం చిత్ర దర్శకుడు సుదర్శన్ మరియు సుగన్ తదితరులు పాల్గొన్నారు..

పూల సిద్దేశ్వర రావు హీరోగా పరిచయమవుతున్న చిత్రం రథేరా. జాకట్ రమేష్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పూల సిద్దేశ్వర రావు, నరేష్ యాదవ్, వై ఎస్ కృష్ణమూర్తి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ ఇటీవల తన కార్యాలయం లో విడుదల చేశారు . ఈ కార్యక్రమంలో హీరో పూల సిద్దేశ్వర రావు, దర్శకుడు జాకెట్ రమేష్, నిర్మాత వై ఎస్ కృష్ణమూర్తి, నరేష్ యాదవ్, నీనోరకం చిత్ర దర్శకుడు సుదర్శన్ మరియు సుగన్ తదితరులు పాల్గొన్నారు...

ఈ సందర్భంగా డేరింగ్ డైరెక్టర్ వి వి వినాయక్ మాట్లాడుతూ - " ట్రైలర్ చాలా బాగుంది, ఆర్టిస్టులు అందరూ కొత్తవారిని తీసుకొని అద్భుతంగా దర్శకుడు రమేష్ సినిమాను రూపొందించారు.  టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.హీరో కి మొదటి సినిమా అయినా చాలా అనుభవం ఉన్న వాడిలా నటించాడు. తనకి మంచి ఫ్యూచర్ ఉంది. దర్శకుడు మంచి కంటెంట్ తో సినిమా తెరకెక్కించారు. మ్యూజిక్ తో పాటు ఆర్.ఆర్ కూడా బాగుంది. తప్పకుండా అతనికి ఈ సినిమా ద్వారా మంచి బ్రేక్ వస్తుంది. అలాగే నిర్మాత కృష్ణమూర్తి గారికి ఈ సినిమా ద్వారా మరిన్ని డబ్బులు రావాలని కోరుకుంటున్నాను " అన్నారు.