రాధే శ్యామ్ మూవీ పబ్లిక్ టాక్ : సినిమా క్లైమాక్స్ అదుర్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

First Published Mar 11, 2022, 11:30 AM IST | Last Updated Mar 11, 2022, 11:30 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే . చాలా కాలం తర్వాత ప్రభాస్ నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ఇది.  రాధే శ్యామ్ మూవీ థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ప్రేమ కథ. ఈ చిత్రంలో ప్రభాస్ పామ్ ఆర్టిస్ట్ ( హస్తసాముద్రిక నిపుణుడు) గా నటిస్తున్నాడు. అతడి ప్రేయసిగా పూజా హెగ్డే నటిస్తోంది. వీరిద్దరి ప్రేమకు విధి అడ్డుగా మారితే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి ? విజయం ప్రేమదా ? విధిదా ? అనేదే ఈ చిత్ర కథ. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించారు.. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులు దీన్ని ఆదరించారు లేదా అనేది ఈ పబ్లిక్ టాక్ లో చూడండి..!