Asianet News TeluguAsianet News Telugu

నేను క్షేమంగానే ఉన్నాను.. సంగీత దర్శకుడు శశిప్రీతమ్

ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు శశి ప్రీతమ్‌కు ఈ రోజు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్నారు. 

ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు శశి ప్రీతమ్‌కు ఈ రోజు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్నారు. గత గురువారం ఆయన గుండెనొప్పితో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ హాస్పటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. హాస్పటిల్ లో చేరేటప్పటికి ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.  టెస్ట్ లు చేసి వెంటనే గుండెకు స్టంట్స్ వేసారు. దాంతో అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్దితి ఎలా ఉందని కంగారుపడుతున్నారు. ఈ నేపధ్యంలో  ఆయన స్వయంగా ఓ వీడియో రిలీజ్ చేసి వివరణ ఇచ్చారు. తాను క్షేమంగా ఉన్నానని తనకోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.