మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మోహన్ బాబు బండ బూతులు తిడుతూ మా అమ్మని, నా కులాన్ని అవమానించాడు : మంచు విష్ణు హెయిర్

సినీనటుడు మంచు విష్ణు(Manchu Vishnu) పర్శనల్ హెయిర్‌ స్టైలిస్ట్‌పై జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. 

First Published Feb 28, 2022, 6:42 PM IST | Last Updated Feb 28, 2022, 6:42 PM IST

సినీనటుడు మంచు విష్ణు(Manchu Vishnu) పర్శనల్ హెయిర్‌ స్టైలిస్ట్‌పై జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆయన ఆఫీసులో హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రిని  దొంగతనం జరిగిందని అన్నారు. వాటి విలువ సుమారు రూ. 5లక్షల ఉంటుందని అంచనా.. ఈ చోరీపై విష్ణు మేనేజర్ సంజయ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది.   ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను పంపిన ఒక సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో తాను ఎటువంటి దొంగతనం చేయలేదని, మంచు ఫ్యామిలీనే తన మీద లేనిపోని అభాండాలు వేస్తుందని తెలిపాడు.