పోలీస్ కమీషనర్ కే ఛాలెంజ్ విసిరిని మిమిక్రీ శివారెడ్డి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో  భాగంగా మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు శివారెడ్డి మణి కొండ లోని తన  నివాసంలో మూడు మొక్కలు నాటారు.

First Published Jul 31, 2020, 12:47 PM IST | Last Updated Jul 31, 2020, 12:47 PM IST

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో  భాగంగా మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు శివారెడ్డి మణి కొండ లోని తన  నివాసంలో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన ఈ కార్యక్రమం ఒక యుద్దంలా పర్యావరణ ప్రేమికులు  అంతా ముందుకు తీసుకెళ్తున్నారు అని తెలిపారు. ఇంతటి కార్యక్రమం లో తననూ భాగస్వామిని చేసిన, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం.వి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. హాస్యనటుడు ఆలీ, కరీంనగర్ పోలీస్ కమీషనర్ కమలహాసన్ రెడ్డి, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, పాటల రచయిత కాసర్ల శ్యామ్, తన సోదరుడు కళాకారుడు సంపత్ లను ఛాలెంజ్ కు నామినేట్ చేశాడు.