నిజజీవితంలోనూ మెగాస్టారే... అభిమాని బిడ్డ పెళ్లిన చిరంజీవి ఆర్థిక సాయం

మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనే కాదు నిజజీవితంలోనూ హీరోనే అని నిరూపించుకున్నారు.

First Published Feb 9, 2022, 5:43 PM IST | Last Updated Feb 9, 2022, 5:43 PM IST

మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనే కాదు నిజజీవితంలోనూ హీరోనే అని నిరూపించుకున్నారు. ఓ అభిమాని కూతురు పెళ్లికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించిన మెగాస్టార్ చిరంజీవి తన దయాగుణాన్ని చాటుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన గోక కొండలరావు చిరంజీవి వీరాభిమాని. చిరంజీవి సినిమాలకే కాదు ఆయన సేవాగుణానికి కూడా కొండలరావు అభిమాని. తన అభిమాన నటుడి కోసం అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అవదుల్లేని అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాడు. అలాంటి అభిమాని కుమార్తె పెళ్లి నిశ్చయమయ్యిందని తెలిసి చిరంజీవి ఆనందించారు. వెంటనే పెళ్లి ఖర్చులకోసం లక్ష రూపాయలను కొండలరావుకు అందించారు. అలాగే అఖిలభారత చిరంజీవి యువత కూడా కొండలరావుకు మరో లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా అందచేశారు.